Header Banner

యువ క్రికెటర్లకు ఎంఎస్ ధోనీ క్లాస్.. వారికి పలు విలువైన సలహాలు, సూచనలు!

  Wed May 21, 2025 11:24        Sports

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు. యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోనీ మాట్లాడుతూ, "మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దు. సీనియర్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది నుంచి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారి సొంతం" అని అన్నారు.

 

ఇది కూడా చదవండి: టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

అంచనాల భారాన్ని మోయకుండా సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించాలని యువకులకు సూచించారు. ఇదే క్రమంలో తమ జట్టు ప్రదర్శనపైనా ధోనీ స్పందించారు. "మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యమే ఉంచాం. కానీ మ్యాచ్‌ ఆరంభంలో త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్‌, మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పడింది. బ్రెవిస్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రన్‌రేట్‌ చక్కగా ఉంది. కానీ మేం మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో దాన్ని కొనసాగించలేకపోయాం" అని ధోనీ వివరించారు. అలాగే, పేసర్‌ కాంబోజ్‌ బౌలింగ్‌ను ప్రశంసిస్తూ, "కాంబోజ్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. మనం ఊహించిన దానికంటే అతడి బంతులు మనల్ని వేగంగా తాకుతాయి. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయడమంటే అంత తేలిక కాదు. కానీ కాంబోజ్‌ బాగా బౌలింగ్‌ చేశాడు" అని ధోనీ కొనియాడారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం, రాజస్థాన్‌ రాయల్స్‌ 17.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia